ఎమ్మిగనూరు పట్టణంలోని సుందరయ్య భవన్లో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మికుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా, ఫిబ్రవరి 1న జరిగే చేనేత కార్మిక సంఘం మహాసభలను జయప్రదం చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కామర్తి రాజు, పట్టణ కార్యదర్శి ధరణి కలప మాట్లాడుతూ, ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం చేనేతలకు చేయూతనివ్వాలని వారు డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 1న ఎమ్మిగనూరు పద్మశాలి కళ్యాణ మండపంలో మహాసభలు జరగనున్నాయి.