పట్టణంలో రోడ్లపై పశువుల సంచారం, ప్రమాదాల భయం

ఎమ్మిగనూరు పట్టణంలో రహదారులు, ప్రధాన చౌరస్తాల్లో పశువులు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. దీంతో వాహనాలకు ఆవులు, ఎద్దులు అడ్డుగా రావడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మార్కెట్ పరిసర ప్రాంతాల్లో మూగజీవులు విచ్చలవిడిగా సంచరిస్తూ, కూరగాయలు విక్రయించే వారి వద్ద నిలబడి ప్రయాణికులకు ఆటంకం కలిగిస్తున్నాయి. మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వస్తున్న జాతరను దృష్టిలో పెట్టుకుని అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్