ఎమ్మిగనూరు పట్టణంలో శుక్రవారం ఎండతో ఆరిపోయిన నగరంపై ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం విరుచుకుపడింది. ఎంఎస్ నగర్‌లో నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల భవనానికి చెందిన ఇటుకల గోడ కూలి పక్కనే ఉన్న రేకుల షెడ్ పై పడింది. దీంతో షెడ్ లో నిద్రిస్తున్న 12 మందిపై ఇటుకలు పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఏడేళ్ల లక్కీ పరిస్థితి విషమంగా ఉందని బాధితులు తెలిపారు.