ఈనెల 7న సీఎం చంద్రబాబు రాక

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగట్ల గ్రామంలో ఫిబ్రవరి 7న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రైతులకు నూతన పట్టాదార్ పాసు పుస్తకాలను సీఎం స్వయంగా పంపిణీ చేస్తారు. పర్యటనకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కలుగట్లలో బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉండటంతో భద్రత, ఇతర వసతులను జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తోంది.

సంబంధిత పోస్ట్