ఈనెల 6వ తేదీ శుక్రవారం ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్న నేపథ్యంలో, సీఎం సభ వేదిక వద్ద జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఎమ్మెల్యే జయ నాగేశ్వర్రెడ్డి, జెసి నూర్, వివిధ శాఖల అధికారులు బుధవారం పరిశీలించారు. ముఖ్యమంత్రి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారని, ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఎమ్మెల్యే బీవీ అధికారులను ఆదేశించారు.