ఎమ్మిగనూరులో 36 బాధితులకు రూ. 27. 72 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు

ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి నియోజకవర్గంలో 36 మంది బాధితులకు రూ. 27.72 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. శుక్రవారం ఎమ్మిగనూరులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు నియోజకవర్గంలోని 180 మంది బాధితులు రూ. 1.5 కోట్ల చెక్కులు అందుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్