పెద్దకడబూరు మండలంలోని కంబదహాల్ లో అవ్వాతాతలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను బుధవారం టీడీపీ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ మునెప్ప, బూత్ యూనిట్ ఇన్ చార్జ్ మురళీ పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి నెల ఒకటో తారీఖున క్రమం తప్పకుండా ఇంటి వద్దకే పెన్షన్లు అందజేస్తూ వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు అండగా నిలుస్తున్నారని వారు తెలిపారు.