లాభాల సంఘాన్ని నష్టాల ఆప్కోలో విలీనం చేయొద్దు.. మాచాని సోమనాథ్

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బి.సి. సెల్ ప్రధాన కార్యదర్శి మాచాని సోమనాథ్ ఎమ్మిగనూరులో ఆదివారం మాట్లాడుతూ లాభాల్లో ఉన్న ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘాన్ని అప్పుల్లో ఉన్న ఆప్కోలో విలీనం చేయడం సరికాదని అన్నారు. లాభాల్లో ఉన్న సంస్థను నష్టాల్లో ఉన్న సంస్థతో కలపడం వల్ల చేనేత కార్మికులకు ప్రయోజనం ఉండదని, ఆప్కో ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆయన తెలిపారు. ఈ విలీనంపై మాచాని సోమనాథ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్