ఎమ్మిగనూరు: ఇంటి గోడ విషయంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ

ఎమ్మిగనూరు మండలంలోని గుడికల్లు గ్రామంలో ఇంటి గోడ విషయంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరిగింది. గురువారం ఎస్సై శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం మాల పెద్దయ్య, మాల నవీన్ మధ్య సెంట్రింగ్ పనిపై వాగ్వాదం చెలరేగింది. దీంతో కర్రలతో ఒకరికొకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఇరువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు 5 మందిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్