ఎమ్మిగనూరు: కేంద్ర బడ్జెట్‌లో దళిత, గిరిజనులకు ఘోర అన్యాయం

కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఎమ్మిగనూరు మండల ప్రధాన కార్యదర్శులు ఎస్ తిమ్మన్న, ఉపాధ్యక్షులు సుమల ఆంథోనీ బుధవారం ఎమ్మిగనూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, కేంద్ర బడ్జెట్‌లో దళిత, గిరిజనులకు ఘోర అన్యాయం జరిగిందని, సామాజిక న్యాయం పేరుతో మోసం చేశారని ఆరోపించారు. ఎస్సీఎస్పీ, టీఎస్పీ నిధులు జనాభా శాతానికి తగ్గట్టుగా లేవని, విద్యా, హాస్టళ్లు, స్కాలర్‌షిప్‌లు, మౌలిక సదుపాయాలు సరిపడకపోవడం, ప్రభుత్వ-ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ అమలు లేమి వంటివి ఆందోళన కలిగిస్తున్నాయని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్