ఎమ్మిగనూరు: పూరి గుడిసె కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

మంగళవారం ఎమ్మిగనూరు పట్టణంలో ముక్కరమ్మకు ప్రభుత్వ కేటాయించిన రెండు సెంట్ల స్థలాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ నాయకులు బుట్టా శివనీలకంఠకు వినతిపత్రం అందించారు. న్యాయం పొందే వరకు పోరాటం కొనసాగిస్తామని, బెదిరింపులు, తప్పుడు కేసులు పెట్టినా వెనక్కి తగ్గమని, న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థ, చట్టాలపై సంపూర్ణ నమ్మకం ఉందని వారు తెలిపారు. బుధవారం 10 గంటలకు తహసిల్దార్ కార్యాలయంలో గత అర్జీలపై తీసుకున్న నిర్ణయాలపై చర్చ జరుపనున్నారు. న్యాయం జరిగితే ధర్నాను విరమిస్తామని, లేకపోతే చట్టబద్ధంగా పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్