ఎమ్మిగనూరు మిలిటరీ కాలనీలోని ప్లాట్ నెం. 13 భూహక్కుల విషయంలో అక్రమ కబ్జా ప్రయత్నాలు వెలుగులోకి వచ్చాయి. బుధవారం, చట్టబద్ధ యజమాని పిట్ట జ్యోతి ఫిర్యాదు మేరకు, వైసీపీ పార్లమెంట్ ఇన్‌చార్జి బుట్టా రేణుక ఆదేశాలతో వైస్ చైర్మన్ డి. నజీర్ అహమ్మద్ తహసీల్దార్ కార్యాలయంలో భూహక్కుల రక్షణ కోసం వినతిపత్రం సమర్పించారు. పెద్ద రంగన్న అనే వ్యక్తి తనకు ఎటువంటి చట్టబద్ధ హక్కులు లేకపోయినా, తప్పుడు డాక్యుమెంట్ నెం. 4948/2025ను సృష్టించి, ప్లాట్ నెం. 12గా చూపిస్తూ అక్రమంగా ప్లాట్ నెం. 13లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.