కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బీజేపీ జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు పద్మావతిపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై బుధవారం ఎమ్మిగనూరు బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణ ఎస్సై మధుసూదన్ రెడ్డి కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని నాయకులు కోరారు. ఈ ఫిర్యాదులో బీజేపీ నాయకులు గురురాజ్ దేశాయ్, పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్ దయాసాగర్ తదితరులు పాల్గొన్నారు.