ఎమ్మిగనూరు: సీఎం, పీఎం చిత్రపటాలకు దివ్యాంగులు పాలాభిషేకం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకానికి కృతజ్ఞతగా, ఎమ్మిగనూరులో మంగళవారం కూటమి నేతలు, దివ్యాంగులు కలిసి సీఎం చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ పథకం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది దివ్యాంగులకు ఆర్థిక భారం తగ్గి, విద్య, ఉపాధి, వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు, దివ్యాంగులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్