ఎమ్మిగనూరు వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీని ఆప్కోలో విలీనం చేయాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ చేనేత నాయకులు సోమవారం కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆదేశాల మేరకు నాయకులు మాట్లాడుతూ, డాక్టర్ పద్మశ్రీ మాచని సోమప్ప స్థాపించిన ఈ సొసైటీ వేలాది చేనేత కుటుంబాలకు జీవనాధారమని తెలిపారు. ఆప్కోలో విలీనం చేస్తే సొసైటీ స్వయం ప్రతిపత్తి కోల్పోయి, చేనేత కార్మికుల ఆదాయం తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యవర్తిత్వం పెరగడం వల్ల సరైన ధరలు లభించక నష్టాలు కలగవచ్చని పేర్కొన్నారు.