ఎమ్మిగనూరు: మహిళల భద్రతపై వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు

కర్నూలు జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా, మహిళల భద్రతపై అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థులు 'మహిళల భద్రత – సమాజం బాధ్యత', 'సైబర్ మోసాల నుండి రక్షణ', 'స్వీయ రక్షణ' వంటి అంశాలపై తమ ప్రతిభను కనబరిచారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలకు పోలీసు అధికారులు బహుమతులు అందజేయనున్నారు.

సంబంధిత పోస్ట్