ఎమ్మిగనూరు పట్టణంలో టూ వీలర్ బైక్ మెకానిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్థాదికను గోనెగండ్ల మెకానిక్ సభ్యులు ఇస్మాయిల్ జగదీష్ సన్మానించారు. గోనెగండ్ల టూ వీలర్ బైక్ అసోసియేషన్ అధ్యక్షులుగా జగదీశ్, ఉపాద్యక్షులుగా ఇస్మాయిల్ ని ఎన్నుకున్నారు. అనంతరం టూ వీలర్ బైక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాదిక్ మాట్లాడుతూ మెకానిక్ సభ్యులకు అన్ని వేళలా అండగా ఉంటామన్నారు. వాహనదారులకు మెకానికులు తగు సలహాలు ఇవ్వాలని సూచించారు.