ఎమ్మిగనూరు: 31న చేనేతల కో-ఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం

ఎమ్మిగనూరు చేనేత కో-ఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం ఈనెల 31న వివర్స్ కాలనీ మైదానంలో నిర్వహించనున్నట్లు వైసీపీ పార్లమెంట్ ఇన్‌చార్జి బుట్టా రేణుక ఆదివారం తెలిపారు. ఈ సమావేశంలో సొసైటీని ఆప్కోలో విలీనం చేయాలన్న ప్రయత్నాలను సమీక్షించి, దానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవాలని సభ్యులను కోరారు. పద్మశ్రీ మాచాని సోమప్ప స్థాపించిన సొసైటీని ఆయనకు గుర్తుగా నిర్వహించాలని, సభ్యులు, స్థానికులు, ప్రజాసంఘాలు, పార్టీకతీత ప్రజలు సమావేశంలో పాల్గొని విలీనానికి వ్యతిరేకంగా మద్దతు తెలుపాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్