శనివారం, మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ నాయకులు ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్తలు పూజారి ఈరన్న, గొల్ల ఆంజనప్ప, గొల్ల రాముడులను పరామర్శించారు. ఇటీవల జరిగిన దాడిలో గాయపడిన వీరి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాంపురం రెడ్డి సోదరుల కుటుంబం బాధితుల కుటుంబాలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందజేశారు. వై. ప్రదీప్ రెడ్డి వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి విశ్వనాథ్ రెడ్డి, అడ్వకేట్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.