ఎమ్మిగనూరు: కారు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

ఎమ్మిగనూరు పట్టణంలోని నవోదయ కళాశాల సమీప సర్వీస్ రోడ్డుపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కోటేకల్ గ్రామానికి చెందిన కాసిం అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటకకు చెందిన కారు డ్రైవర్ నిద్రమత్తులో వేగంగా వాహనం నడుపుతూ రోడ్డు పక్కన టీ తాగుతున్న కాసింను ఢీకొట్టాడు. ఈ ఘటనలో కాసిం కాళ్లకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్