గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోని శ్రీదత్తసాయి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సాయినాథుడికి ప్రత్యేక పూజలు చేసి, అర్చకులు వేదమంత్రోచ్చరణతో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డికి ఆశీస్సులు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.