ఎమ్మిగనూరు నియోజకవర్గం నాగలదిన్నె గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన టీడీపీ నాయకులు తెలుగు భీమన్నతో పాటు, గువ్వలదొడ్డి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కనకవీడు గ్రామానికి చెందిన చిన్న నరసింహులు మృతదేహాలకు బుధవారం ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంత్యక్రియలకు ఆర్థికసాయం అందజేశారు.