ఎమ్మిగనూరును జిల్లా కేంద్రంగా ప్రకటించాలి

ఎమ్మిగనూరును జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరాహార దీక్షలు గురువారం 26వ రోజుకు చేరుకున్నాయి. ఐదు నియోజకవర్గాలలో అర్హత ఉన్న ఏ నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించాలో అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలని జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా ప్రకటన చేయకపోతే రాజకీయ పార్టీలకు మనుగడ ఉండదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజేష్, రంగయ్య, రాము, చిన్ని ప్రసాద్, చార్లెస్, పేటయ్య, గోవిందమ్మ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్