మోసానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని వైసీపీ పార్టీ పట్టణ అధ్యక్షులు కామర్తి నాగేశప్ప విమర్శించారు. గురువారం ఎమ్మిగనూరులో బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ కార్యక్రమం 17, 18వ వార్డుల్లో నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ, వాటి అమలులో జరిగిన మోసాలను ప్రజలకు వివరించారు. ప్రజలు చంద్రబాబును, కూటమిని నిలదీయాలని విజ్ఞప్తి చేశారు. వైస్ చైర్మన్ నజీర్ అహమ్మద్ ఉన్నారు.