ఎమ్మిగనూరు: కుటమి పాలన పూర్తిగా మాటలకే పరిమితమైంది

రాష్ట్రంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పాలన పూర్తిగా మాటలకే పరిమితమైందని, నేలమీద అమలు శూన్యమైందని ఎమ్మిగనూరు నియోజకవర్గం వైయస్ఆర్‌సీపీ ఇంచార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను తీవ్రంగా ఎండగట్టారు. ఎన్నికల సమయంలో అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు ఇచ్చిన హామీలు కేవలం ఓట్ల కోసం వేసిన ఎరలేనని విమర్శించారు. రెండేళ్లు గడిచినా ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. శాంతియుతంగా తమ హక్కుల కోసం ఆందోళన చేస్తున్న మహిళలపై లాఠీచార్జ్ చేయించడం, పోలీసుల ద్వారా బలప్రయోగం చేయించడం ఈ ప్రభుత్వ అసలు స్వరూపాన్ని బయటపెట్టిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్