రాజోలిబండ కుడిగట్టు కాలువ కొనసాగింపును ఆమోదించిన ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఎమ్మిగనూరు మాచాని సోమప్ప సర్కిల్ వద్ద సీఎం చంద్రబాబు చిత్రపటానికి ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు పాలాభిషేకం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. పశ్చిమ కర్నూలులో కరువు నివారణలో కాలువ ప్రాముఖ్యతని, గత వైసిపి ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.