ఎమ్మిగనూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు వీరేష్ యాదవ్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి మహాత్ముడి పేరును తొలగించడం బాధాకరమని నాయకులు వీరేష్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, ఈ పథకాన్ని గాంధీ పేరుతోనే కొనసాగిస్తామని తెలిపారు.