కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఆదివారం జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులు, చెడు నడత కలిగిన వారికి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. నేర ప్రవృత్తికి స్వస్తి పలికి, సత్ప్రవర్తనతో జీవించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.