గోనెగండ్ల: కమర్షియల్ సిలిండర్లు అందించాలని నిరసన

ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గోనెగండ్ల బస్టాండ్ ప్రాంతంలో బుధవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వ్యాపార, వాణిజ్య రంగ నిర్వాహకులను ఆదుకోవాలని నిరసన తెలిపారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా తక్షణం చేయకపోతే వ్యాపారుల కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమవుతాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రాస్తారోకో నిర్వహించి, తహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అధికారులు వెంటనే సిలిండర్ల సరఫరా చేసి, వ్యాపారుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్