ఎమ్మిగనూరులోని నారాయణ పాఠశాలలో క్లస్టర్ ప్రిన్సిపల్ అన్వర్ భాషా ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పిపి-2 మరియు 5వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్లు అందజేసి, వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులలో విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సమగ్ర అభివృద్ధికి పాఠశాల కృషి చేస్తోందని ప్రిన్సిపల్ తెలిపారు. విద్యార్థులు తదుపరి తరగతులకు ఉత్సాహంగా వెళ్లి, పదాలు, అక్షరాలు, వాక్యాలు, విలువలు గురించి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.