గుడేకల్: పొలం వివాదంలో అన్నదమ్ములపై దాడి

ఎమ్మిగనూరు మండలంలోని గుడేకల్ గ్రామంలో 30 ఏళ్లుగా సాగు చేస్తున్న పట్టా భూమి విషయంలో వివాదం తలెత్తింది. బుధవారం, బోయ వీరేష్, బోయ దేవిరెడ్డి అనే ఇద్దరు అన్నదమ్ములు అదే గ్రామానికి చెందిన మాల పెద్దరంగన్న, మాల చిన్నరంగన్నల చేతిలో దాడికి గురయ్యారు. ఈ దాడిలో బోయ వీరేష్ తలకు తీవ్ర గాయాలవగా, బోయ దేవిరెడ్డికి కూడా గాయాలయ్యాయి. బాధితులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్