కర్నూలు జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రత్యేక కృషి జరుగుతోందని జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి పి. విజయ తెలిపారు. శుక్రవారం ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామంలో వంద రోజుల ప్రణాళిక కార్యక్రమంలో మాట్లాడుతూ, బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని, బాలికలకు 18, అబ్బాయిలకు 21 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేయాలని సూచించారు. తల్లిదండ్రులు, మధ్యవర్తులు, ఫంక్షన్ హాల్ యజమానులు కూడా చట్ట ప్రకారం శిక్షార్హులని హెచ్చరించారు. బాలికల రక్షణ కోసం బాలసదనాలు, శక్తి యాప్ వినియోగం, సమయపాలనలో కౌన్సిలింగ్ వంటి అంశాలను వివరించారు.