ఎమ్మిగనూరులో అప్పుల బాధతో చేనేత కార్మికుడి ఆత్మహత్య

అప్పుల బాధను తట్టుకోలేక శివన్న నగరంలో యువరాజు (42) అనే చేనేత కార్మికుడు శుక్రవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య, ముగ్గురు కుమార్తెలతో జీవనం సాగిస్తున్న యువరాజు, కొత్త ఇంటి నిర్మాణం కోసం రూ. 12 లక్షల వరకు అప్పులు చేసినట్లు బంధువులు తెలిపారు. అప్పు ఇచ్చినవారు ఇంటికి వచ్చి నిలదీయడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్