చేనేత కార్మికుడు ఆత్మహత్య: ఎమ్మెల్యే పరామర్శ

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని శివన్నా నగర్ లో నివాసం ఉంటున్న రాజు (43) అనే చేనేత కార్మికుడు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ భారం తట్టుకోలేక నిన్న అప్పుల బాధతో మగ్గానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన గురించి తెలుసుకున్న ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వర్ రెడ్డి, రాజు భౌతికకాయాన్ని సందర్శించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి సహాయం అందించి, అన్ని విధాలా అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా కల్పించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్