పెసలదిన్నెలో సాగునీటి చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం

ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి బుధవారం పెసలదిన్నె గ్రామంలో నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన చెరువును పరిశీలించి, రైతులతో సమావేశమయ్యారు. నాలుగు దశల్లో అమలు కానున్న ఈ కార్యక్రమంలో పనుల గుర్తింపు, నిధుల మంజూరు, పనుల అమలు, రిపోర్టింగ్, డాక్యుమెంటేషన్ జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపుతో పాటు రైతులకు సాగునీటి సౌకర్యాలు మెరుగుపడతాయని, వ్యవసాయానికి మేలు జరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్