వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఎమ్మిగనూరు పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైయస్ జగన్ కు నోబుల్ బహుమతి ఇవ్వాలన్నారు. సొంత బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డిని, దారుణంగా హత్య చేసి, గుండెపోటు అంటూ డ్రామాలు ఆడిన ఘనత ఆయనకే దక్కుతుందని విమర్శించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్ర లడ్డును, అపహస్యం చేసిన చరిత్ర కూడా జగన్ దేనని దుయ్యబట్టారు. వైసిపి తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.