ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామంలో కురువ నాగేష్‌పై జరిగిన దాడి ఘటనలో కడిమెట్ల గ్రామానికి చెందిన ఐదుగురిపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. గాయపడిన నాగేష్‌ను ప్రభుత్వ ఆసుపత్రిలో తెలుగుదేశం పార్టీ నాయకులు పరామర్శించారు. టీడీపీ మండల అధ్యక్షుడు కేటీ వెంకటేష్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తపై దాడి చేయడం దురదృష్టకరమని, ఘటనపై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పరామర్శలో కేశన్న, మద్దిలేటి తదితర నాయకులు పాల్గొన్నారు.