కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి బుధవారం నల్లజర్ల రైతు సేవా కేంద్రంలో జరిగిన 'రైతన్నా మీకోసం' కార్యక్రమంలో రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న సందర్భంగా ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. అనంతరం గ్రామ రైతులతో సంభాషించిన కలెక్టర్, ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతుల ఆదాయం పెంపు, ఖర్చుల తగ్గింపు, భూమి సారవంతం పెంపు సాధ్యమవుతుందని పేర్కొన్నారు.