అప్పుల భారం భరించలేక ఎమ్మిగనూరు మండలం కడివెళ్ల గ్రామానికి చెందిన మారెప్ప (27) అనే యువ రైతు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. మారెప్పకు 2 ఎకరాల సొంత భూమి ఉండగా, అదనంగా ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని మొక్కజొన్న సాగు చేశాడు. వ్యవసాయ పెట్టుబడుల కోసం బయట వ్యక్తుల వద్ద సుమారు రూ. 10 లక్షల వరకు అప్పులు చేశాడు. పంట ఆశించిన మేరకు రాకపోవడంతో అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపానికి గురై నాలుగు రోజుల క్రితం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందినట్లు పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపారు.