కలుగొట్ల: రాయలసీమకు క్యాన్సర్ గడ్డలా మారిన జగన్: ఎమ్మెల్యే

ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి మంగళవారం కలుగొట్ల గ్రామంలోని కొండమ్మ చెరువును సందర్శించి, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాయలసీమ బిడ్డనని చెప్పుకుంటూ రాయలసీమకు క్యాన్సర్ గడ్డలా మారారని విమర్శించారు. అధికారాన్ని కోల్పోయిన వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలతో ప్రజల్లో చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి ఆ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీరు రాదని ఆయన అన్నారు. వైసీపీ హయాంలో నాశనం చేసిన ప్రాజెక్టులను సీఎం చంద్రబాబు నాయుడు పునరుద్ధరించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్