కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తిని పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు

కర్నూలు జిల్లా కోసిగి మండలం కందుకూరు గ్రామం నుంచి అగసనూరు గ్రామానికి వెళ్లే రహదారిలోని కడిదొడ్డి క్రాస్ వద్ద కర్ణాటక మద్యం అక్రమంగా తరలిస్తున్న ఉసేని అనే వ్యక్తిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఆర్లబండ గ్రామానికి చెందిన ఉసేని బైక్‌పై 576 కర్ణాటక ఒరిజినల్ చాయిస్ 90 ఎంఎల్ మద్యం ప్యాకెట్లను తరలిస్తుండగా అధికారులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. సుమారు రూ.38,800 విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ భార్గవ్ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్