కోటేకల్: మద్యానికి బానిసైన భర్త.. భార్య ఆత్మహత్య

ఎమ్మిగనూరు మండలం కోటేకల్ గ్రామంలో శుక్రవారం రాయల తిమ్మమ్మ(34) అనే మహిళ తన భర్త మద్యం వ్యసనం కారణంగా మనస్తాపంతో పత్తి పంటకు తెచ్చిన గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆసుపత్రికి తరలించినా ఫలితం లేక మృతి చెందింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబీకుల ప్రకారం, వారికి రూ. 6 లక్షల అప్పులు ఉన్నట్లు తెలిపారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్