డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ ఉపయోగిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జనవరి నుంచి నవంబర్ 30 వరకు 925 కేసులు నమోదైనా వాహనదారుల్లో మార్పు లేదని, డ్రైవింగ్‌లో ఫోన్ వాడటం ప్రాణాలకు ప్రమాదకరమని పేర్కొన్నారు. ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.