వారం రోజులపాటు నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో కర్నూలు జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో రైతు సేవా కేంద్రాల్లో వర్క్‌షాప్‌లు సమర్థంగా నిర్వహించాలని, డ్రిప్ ఇరిగేషన్, క్రాప్ డైవర్సిఫికేషన్, నేచురల్ ఫార్మింగ్ పెంపుపై నివేదికలు సమర్పించాలని ఆమె అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 5న మెగా పేరెంట్స్–టీచర్ మీటింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు.