ఎమ్మిగనూరు సమగ్రాభివృద్ధి కి మాచాని సోమప్ప ఎనలేని కృషి

దివంగత నేత మాచాని సోమప్ప 48వ వర్ధంతి సందర్భంగా సోమవారం ఎమ్మిగనూరు పట్టణంలోని మాచాని సోమప్ప సర్కిల్ వద్ద ఉన్న వారి విగ్రహానికి ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. చేనేత కార్మికుల అభ్యున్నతికి, ఎమ్మిగనూరు సమగ్ర అభివృద్ధికి సోమప్ప చేసిన సేవలను ఆయన స్మరించుకున్నారు. సోమప్ప స్ఫూర్తితో నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, నేతన్నలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్