రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

నందవరం మండలం ముగతి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రచ్చుమరి గ్రామానికి చెందిన షాషావలి (40) అనే వ్యక్తి మృతి చెందారు. ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో మృతుని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్