ముగతి పేటలో రిటైర్డ్ సెక్రటరీ ఇంట్లో భారీ చోరీ

ఎమ్మిగనూరు పట్టణంలోని ముగతి పేటలో రిటైర్డ్ సెక్రటరీ శ్రీనివాసుల ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. గత నెల 26న ఇంటికి తాళం వేసి కుమారుడి వద్దకు వెళ్లిన ఆయన, ఈనెల 27న సాయంత్రం తిరిగి రాగానే తాళం విరిగి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పరిశీలించగా, 20 తులాల బంగారు ఆభరణాలు, రూ. 40 వేల నగదు దొంగిలించబడినట్లు గుర్తించారు. బుధవారం ఎమ్మిగనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్