ఎమ్మిగనూరు పట్టణంలో మోహన్ బాబు దిష్టిబొమ్మ దహనం

ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్ ప్రధాన కూడలిలో బుధవారం విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మోహన్ బాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజు దోపిడీపై ప్రశ్నించినందుకు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్, జిల్లా ఉపాధ్యక్షులు వినోద్‌లను కిడ్నాప్ చేశారని ఆరోపించారు. వెంటనే మంచు విష్ణు, మోహన్ బాబులపై క్రిమినల్ కేసు పెట్టాలని నాయకులు వీరేష్, శేఖర్, మహేంద్ర, అఫ్రిది డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్