ముగతి: బైక్ - ఆటో ఢీకొని ఒకరు మృతి

నందవరం మండలం ముగతి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో షేక్ షావలి (40) అనే వ్యక్తి మృతి చెందాడు. రచ్చమర్రికి చెందిన షావలి, నదికైరవాడికి చెందిన 7వ తరగతి విద్యార్థి నవీన్ కుమార్ బైక్‌పై ఎమ్మిగనూరుకు వెళ్తుండగా, కోసిగి మండలం దొడ్డి బెలగల్ వైపు వస్తున్న ఆటో ముగతి సమీపంలోని ఎంఆర్బీ ఇటుకల బట్టి వద్ద ఎదురెదురుగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో షేక్ షావలి చికిత్స పొందుతూ మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన నవీన్ కుమార్ పరిస్థితి విషమించడంతో కర్నూలుకు తరలించారు.

సంబంధిత పోస్ట్