నందవరం: మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు

ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన 135వ 'మన్ కీ బాత్' కార్యక్రమాన్ని పార్టీ నాయకులు వీక్షించారు. ఈ కార్యక్రమంలో దేశాయ్ నెట్‌వర్క్ అధినేత, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి గురురాజ్ దేశాయ్ పాల్గొన్నారు. అనంతరం ప్రధాని సందేశాలను కార్యకర్తలకు వివరించారు. కార్యక్రమంలో ఎస్సీ మోర్చా మాజీ మండల అధ్యక్షుడు కె. శివ, సీనియర్ నాయకులు టీవీ మెకానిక్ శ్రీనివాసులు, డానియల్, దండు ఈరన్న, దండు పెద్ద బీరప్ప, మైనారిటీ నాయకుడు అబ్దుల్, చాకలి మహేష్, బుడ్డన్న, గని, సోషల్ మీడియా కన్వీనర్ దండు వీరేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్